Powered by Blogger.

Blog Archive

Report Abuse

How to Add a Member in AP Ration Card 2025 | Rice Card Update Process Online | Step-by-Step Guide

How to Add a Member in AP Ration Card 2025 | Rice Card Update Process Online | Step-by-Step Guide

 How to Add a Member in AP Ration Card 2025 | Rice Card Update Process Online | Step-by-Step Guide


AP Ration Card Member Adding Process: 

 Ration Card లో కుటుంబ సభ్యులను చేర్చుటకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. పుట్టిన పిల్లలు మరియు వివాహమైన మహిళలు రేషన్ కార్డులో చేరవచ్చు. ఈ అవకాశం May 31st వరకు మాత్రమే ఉంటుంది . కాబట్టి ఎవరైతే రేషన్ కార్డులో సభ్యుల చేర్పు కొరకు వేచి ఉన్నారో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబ సభ్యులను రేషన్ కార్డులో Add చేసుకుని లబ్ధిని పొందగలరు. ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న ATM కార్డు సైజులో ఉండే AP Smart Ration Card లో మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉండాలంటే తప్పనిసరిగా ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ ద్వారా రేషన్ కార్డు లోకి Add అవ్వాల్సి ఉంటుంది.



చిన్నపిల్లలను రేషన్ కార్డులో చేర్చాలంటే తప్పనిసరిగా కావాల్సినవి


ధ్రువీకరించదగిన పుట్టిన తేదీ, సర్టిఫికెట్ ఉండాలి,ఆధార్ కార్డు ఉండాలి,ఆధార్ కార్డులో ఉన్న చిరునామా గ్రామానికి చెంది ఉండాలి.ఆధార్ కార్డులో కేరఫ్ అడ్రస్ లో ఉన్న పేరు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల పేరుతో మ్యాచ్ అవ్వాలి.హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పేరును నమోదు చేసి ఉండాలి.

వివాహమైన మహిళను రేషన్ కార్డులో చేర్చాలంటే తప్పనిసరిగా కావాల్సినవి


ఆధార్ కార్డు ఉండాలి.ఆధార్ కార్డులో ఉన్న చిరునామా గ్రామానికి చెంది ఉండాలి.మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి.మ్యారేజ్ ఫోటో అందుబాటులో ఉండాలి.వివాహ సర్టిఫికెట్ లేకపోతే ఆధార్ కార్డులో కేరఫ్ అడ్రస్ సెక్షన్ లో భర్త పేరు నమోదు చేసి ఉండాలి.హౌస్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకుని ఉండాలి.

పిల్లలను రేషన్ కార్డులో యాడ్ చేయాలన్న లేదా వివాహం అయిన మహిళను కార్డులో యాడ్ చేయాలన్న ఒకటే Ration Card Appliication Form ఉంటుంది. దరఖాస్తు ఫారం లింకు కింద description లో ఇవ్వటం జరిగింది. లింక్ పై క్లిక్ చేసినట్లయితే నేరుగా మీకు ఫారం డౌన్లోడ్ అవుతుంది.

Download form:



ఫారం ను ప్రింట్ తీసుకున్న తర్వాత Ration Card Application Form కుటుంబ పెద్ద,లేదా దరఖాస్తు చేస్తున్న వారి యొక్క సంతకం చేసి పైన చెప్పిన డాక్యుమెంట్స్ తో మీ గ్రామా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.రేషన్ కార్డులో సభ్యులను జోడించాలంటే Ration Card Member Addition Application fee కేవలం 24 రూపాయలు మాత్రమే. ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు .

రేషన్ కార్డులో సభ్యులను జోడించుటకు ముందుగా పైన చెప్పినటువంటి దరఖాస్తు ఫారం మరియు కావలసిన డాక్యుమెంట్లను మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్న తర్వాత వారు మీకు రసీదును ఇస్తారు. అందులో ఉన్న అప్లికేషన్ నెంబర్తో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లాగిన్ లో New Rice Card EKYC అనే ఆప్షన్ లో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ చూపించిన వారి బయోమెట్రిక్ ను తీసుకుంటారు.

eKYC ను రాష్ట్రంలో ఏ గ్రామా లేదా, వార్డు సచివాలయంలోనైనా పూర్తి చేసుకోవచ్చు.ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్లికేషన్ సంబంధిత VRO వారి AP సేవ లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది.
అక్కడ SIX STEP VALIDATION కు సంబంధించినటువంటి ఫారం ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఏవైనా అనర్హతలు ఉన్నట్టయితే సంబంధిత ఫారం ను దరఖాస్తుదారుని సంతకం చేసి VRO వారి లాగిన్ లో అనర్హులని తేల్చినట్టయితే అక్కడితో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. అర్హులైనట్టయితే అర్హులని చెప్పి దరఖాస్తు దారిని వద్ద సంతకం తీసుకొని వారి లాగిన్ లో అప్లోడ్ చేసినట్లయితే అప్పుడు అప్లికేషన్ సంబంధిత మండల రెవెన్యూ అధికారి వారు లాగిన్ కు ఫార్వర్డ్ అవుతుంది. మండల రెవెన్యూ అధికారి వారి లాగిన్ లో తుది ఆమోదం అయిన తర్వాత Ration Card Print కు అవకాశం ఉంది . అదే విధముగా ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో ATM Card Sized Smart AP Ration Card లో పేరు నమోదు తో మీకు కార్డు పంపిణీ సచివాలయ సిబ్బంది లేదా, VRO వారి ద్వారా జరుగుతుంది. ఈ లోపు మీకు కార్డు అవసరం ఉంటే క్రింది description లో లింక్ ద్వారా Ration Card PDF Download చేసుకోవచ్చు.

Download application form:




గ్రామ లేదా, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన రసీదులో అప్లికేషన్ నెంబర్ తో రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ మీరు తెలుసుకోవచ్చు.అప్లికేషన్ ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది ఎవరు ఏ రోజున ఆమోదం తెలిపారు అనే వివరాలు లింకు ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ కొరకు కింద description లో లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ నెంబర్ ని ఎంటర్ చేయండి.


No comments:

Post a Comment